ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల, కందులాపురం, చిన్నకంభం, గచ్చుకాలువ వీధి తదితర ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ నరసయ్య తెలిపారు. ఇందులో భాగంగా మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ అసౌకర్యనికి ప్రజలు సహకరించాలని కోరారు.