W.G: పెనుగొండలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరగాల్సిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్, ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్, మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు శుక్రవారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. మహాసభల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.