NTR: బాలికల సంరక్షణపై ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, అధికారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బాలికల రక్షణ, వారిపై నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు.