ఉమ్మడి అనంతపురం జిల్లాలో సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు వర్ష సూచనలున్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. రోజువారీగా 13న 13 మి.మీ, 14న 8 మి.మీ, 15న 14 మి.మీ, 16న 16 మి.మీ, 17న 15 మి.మీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు.