రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్‌లో ఇవాళ మళ్లీ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.