GNTR: పెదకాకాని సెంటర్ నుంచి వెనిగండ్ల వెళ్లే రహదారిపై వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు లేవు. ఈ క్రమంలో శనివారం పంచాయతీ సిబ్బంది డబ్బాలతో నీటిని తోడుతూ కనిపించారు. ఈ పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.