WGL: వందేభారత్ ఎక్స్ప్రెస్ రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య వరంగల్ మీదుగా ప్రస్తుతం గురువారం మినహా మిగతా ఆరు రోజులు నడుస్తున్న ఈ రైళ్లు డిసెంబర్ 5నుంచి గురువారానికి బదులుగా సోమవారం ట్రిప్పులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. ఇకనుంచి సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి తెలిపారు.