SRD : ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నానని అన్నకు మెసేజ్ పెట్టి ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్నా పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.