ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతులు, విద్యుత్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.