విజయనగరం: జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు.