WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పదోన్నతి రావడంతో ఇక్కడి నుంచి బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. వర్ధన్నపేట నూతన కమిషనర్గా ప్రస్తుతం వరంగల్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించినట్లు మున్సిపాలిటీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.