రోజూ ఉదయం కేవలం 5 నిమిషాలు జంపింగ్ జాక్స్ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఇలా చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె సంబంధింత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. ఒత్తిడి తగ్గి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.