అన్నమయ్య: అన్ని హంగులతో త్వరలోనే మదనపల్లె జిల్లా ఏర్పడనుందని ఎమ్మెల్యే షాజహాన్ భాష తెలిపారు. శుక్రవారం ఆయన పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. అయితే జిల్లా సాధన కోసం తాను చేసిన పాదయాత్రపై అప్పటి YCP ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.