MBNR: మహబూబ్నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కృషి ఎనలేనిదని మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 10 ఏళ్లలో చూడని అభివృద్ధిని ఈ రెండేళ్లలో మనం చూస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి 824 కోట్లు మంజూరు చేయించడం గొప్ప విషయమన్నారు.