ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 12న జరగబోయే నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.