NDL: వందేమాతరం గేయం దేశభక్తిని ఐక్యతను జాతీయతను ప్రతిబింబిస్తుందని జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ గేయం భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. వందేమాతరం 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, నలంద స్కూల్ విద్యార్థులు అంతా కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు.