ASF: జూనియర్ కళాశాలల విద్యార్థుల వివరాలను యూ డైస్ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల వివరాల నమోదు, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్‌పై ఆయన సమీక్షించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలన్నారు.