మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) మరణించారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. మేఘాలయ రాజకీయాల్లో లాపాంగ్ కీలక పాత్ర పోషించారు. 1972లో రాజకీయ ప్రవేశం చేసి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 1992 నుంచి 2010 మధ్య 4 సార్లు సీఎంగా పనిచేశారు.