పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసులో నిందితుడు మందల రవి (41)ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ. 10,000 జరిమానాను కోర్టు విధించింది. బాధితులకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ. 2లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2017లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తీర్పు ఇచ్చారు.