కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 193 మంది మృతి చెందారు. లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మంటల్లో చిక్కుకుని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 107 మంది చనిపోయారు. ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో పడవ బోల్తాపడి 86 మంది మరణించారు.