HYD నుంచి పర్యటకులు అనంతగిరి హిల్స్ అందాలను చూస్తూ, మారథాన్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్టోబర్ 26వ తేదీన 3-5K, 10K, 21K, 32K రన్ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ రన్నర్స్ తెలిపారు. అనంతగిరి హిల్స్ ట్రయల్ రన్ పేరిట ఈ ఏడాది నిర్వహిస్తున్నామని, పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.