CTR: మద్యం బార్లకు దరఖాస్తు గడువును మళ్ళీ పొడిగిస్తూ శుక్రవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క దరఖాస్తు రాకపోవడంతో మళ్లీ రీనోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించారు. కాగా, 18వ తేదీ చిత్తూరు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో అదృష్ట పరీక్ష ద్వారా మద్యం బార్లను కేటాయించనున్నారు.