ఆసియాకప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్ బెర్తు సాధించడమే లక్ష్యంగా ఇవాళ జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కనీసం డ్రాగా ముగించినా సలీమా బృందం తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఈ టోర్నీ ఆరంభంలో దూకుడుగా ఆడిన భారత్.. చైనాతో సూపర్-4 మ్యాచ్‌లో 1-4తో కంగుతింది. ఫైనల్ చేరాలంటే జపాన్ను భారత్ నిలువరించాల్సి ఉంది.