VKB: ప్రజలతో మమేకం కావడంతో పాటు వారితో స్నేహపూర్వంగా మెలగాలని SP నారాయణ రెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం కోట్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల స్థితిగతులపై సీఐ రఘురాములు, స్థానిక ఎస్సై శైలజకు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసులను పెండింగ్లో ఉంచరాదని సూచించారు.