SKLM: పలాస రైల్వే స్టేషన్లో శుక్రవారం RPF ఎస్సై ఎం. మాల్యాద్రి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 40 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పలాస రైల్వే పోలీస్ సీఐ రవికుమార్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు.