WNP: వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖల అధికారులు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలన్నారు.