KRNL: ఈ నెల 13న కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ-లిటిగేషన్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు.