అన్నమయ్య: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఈనెల 24న విజయవాడ ధర్నా చౌక్ వద్ద దళిత రణభేరి కార్యక్రమం నిర్వహించనుంది. దళితులపై జరుగుతున్న నిరంతర దాడులు, మానభంగాలు, హత్యలను ప్రతిఘటించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అబ్బవరం యుగంధర్ తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా SC, ST, BC మైనార్టీ ప్రజలు, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.