ATP: జిల్లాకు నూతన కలెక్టర్గా నియమితులైన ఆనంద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే అనంతపురం చేరుకున్న ఆయన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం బాపట్ల జిల్లా కలెక్టర్గా నియమించిన విషయం తెలిసిందే.