KRNL: కౌతాళం మండలం రౌడూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండి గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు టెక్నాలజీ పరుగులు తీస్తుంటే తమ గ్రామంలో కనీసం సీసీ రోడ్లు, డ్రైనేజీలకు దిక్కు లేదని వాపోయారు.