BPT: సంతమాగులూరు మండలంలోని పుట్టవారి పాలెంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. దేవాలయానికి వచ్చిన భక్తులు ఇది గమనించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగిన సంఘటనలున్నాయి.