TG: దసరా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ స్టేషన్ నుంచి పలు రైళ్లు నడుపుతుంది. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే కొన్ని రైళ్లను ప్రకటించారు. కాచిగూడ-బికనేర్, కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు నడపనున్నట్లు తెలిపారు. కాచిగూడ-మధురై(07191) ఈ నెల 20 నుంచి నవంబర్ 26 వరకు అరుణాచలం మీదుగా నడపనున్నారు.