SRCL: ఉద్యోగులకు విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయని మండల విద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు. ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులు దేశెట్టి మల్లేశం, తక్కల్ల లచ్చిరెడ్డిలను మూడపల్లి కాంప్లెక్స్ సముదాయంలో మండల విద్యాధికారి వినయ్ కుమార్ శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మల్లేశం పాల్గొన్నారు.