HYD: కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులైన రోషన్, మరో వ్యక్తిని పోలీసులు జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు నిందితులను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తున్నామని, నిందితులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.