WGL: జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs)ను జిల్లా కలెక్టర్ సత్య శారదా శుక్రవారం పరిశీలించారు. ఈ తనిఖీలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీలు, నిల్వ విధానం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. ప్రజాసామ్యాన్ని కాపాడుతూ.. ఎన్నికల పక్రియపై ప్రజల్లో నిస్వార్థమైన నమ్మకం పెంపొందించడమే ఈ తనిఖీ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.