WGL: జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఇవాళ ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతం చేస్తేనే బిల్లులు వెంటనే మంజూరవుతాయని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.