CTR: కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని రాష్ట్ర బీసీ జేఏసీ ఛైర్మన్ జ్ఞాన జగదీశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీల 5 ప్రధాన డిమాండ్లపై భారీ ఎత్తున జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి, కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్, బీసీ సబ్ ప్లాన్ రూపకల్పన జరగాలని కోరారు.