KDP: జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని దిగువపట్టణం కాలనీలోని ఓ డాక్టర్ భవనంపై పిడుగు పడింది. దీంతో స్లాబ్, పీఓపీ పూర్తిగా దెబ్బతింది. ఆస్తినష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. పిడుగుపాటుకు దిగువ పట్టణం కాలనీలో చుట్టుపక్కల ఇళ్లలో టీవీలు, వీధి బల్బులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వాతావరణ శాఖాధికారులు ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.