NRPT: ఉట్కూర్ మండలం ఎడవెళ్ళి పాఠశాలలో శుక్రవారం “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటి, వాటికి తల్లుల పేర్లు పెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు తల్లి–పిల్లల బంధాన్ని బలపరిచిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.