VSP: మార్గశిర మాసోత్సవాలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం విశాఖలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి అభివృద్ధి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించాలన్నారు.