ప్రకాశం: రైళ్లలో ప్రయాణిస్తూ నిద్రిస్తున్న ప్రయాణికుల మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఒంగోలు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మౌలా షరీఫ్ అన్నారు. ఒంగోలులోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఇవాళ సీఐ మాట్లాడారు. వేటపాలెంకు చెందిన చంగల్రావు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు.