VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల చింతలవలస గ్రామంలో శుక్రవారం సీఐ జె.జనార్దనరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మద్యం సీసాలతో ఆర్ మల్లిస్వామి అనే వ్యక్తి పట్టు పడడంతో కేసు నమోదు చేశామని ఎస్సై నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్ వి.అప్పారావు పాల్గొన్నారని తెలిపారు.