JGL: ఎరువుల విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్ సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల్లో అయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, ఈపాస్లో ఎరువుల అమ్మకాలను పరిశీలించారు. ఎరువుల విక్రయాలు నిబంధనలు తప్పకుండా పాటించాలని, ఈపాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలన్నారు.