మహేశ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘SSMB29’. ఇటీవల కెన్యాలో షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన ఈ మూవీ టీమ్.. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. MM కీరవాణి సంగీతమందిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.