RR: హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. మొత్తం 176 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులో 21, బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 45, బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో 31, బీఏ తెలుగు మీడియంలో 40, బీబీఏలో 39 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.