జగిత్యాల టౌన్-3 సెక్షన్లోని 11KV డైరీ ఫీడర్లో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు విద్యుత్ నిలిపివేయబడుతుందని డీఈ కె. గంగారాం తెలిపారు. భవానినగర్, బుడగ జంగాలకాలని, అయ్యప్పగుడి, శాంతినగర్, పద్మనాయక, కరీంనగర్ డైరీ రోడ్, నర్సింగాపూర్ రోడ్, MLA క్యాంప్ ఆఫీస్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని తెలిపారు.