KMM: TGSRTC తమ సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్రాదానం’ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభసందర్భాలలో ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరాశ్రయులు, నిరుపేద విద్యార్థులను పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రలకు పంపుతామని చెప్పారు.