నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి నియమించబడ్డారు. సశీల కర్కి పేరును జెన్-Z నిరసనకారులు ప్రతిపాదించారు. జెన్-Z, ఆర్మీ, అధ్యక్షుడి మధ్య ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో నేపాల్ పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేశారు. కాసేపట్లో ప్రధానిగా కర్కి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, గతంలో నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా సుశీల పనిచేశారు.