ASR: కొండపోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేయాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజా రాణి పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌ను కోరారు. శుక్రవారం పాడేరు ఎంపీ కార్యాలయంలో పలువురు రైతులు ఎంపీని కలిశారు. పట్టాలు లేక కొండపోడు రైతులు నష్టపోతున్నామని ఎంపీకి తెలిపారు. ఎంపీ సబ్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, పట్టాలు పంపిణీ చేయాలన్నారు.