PPM: జంఝావతి ప్రాజెక్ట్ను పూర్తి చేసేదెప్పుడని సీపీఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్ ప్రశ్నించారు. ఈమేరకు శుక్రవారం పార్వతీపురంలోని సీపీఐ ఎంఎల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తిగా కాకపోవడంతో రైతులు అవస్తులు పడుతున్నారని వాపోయారు. వ్యవసాయం లాభదాయకంగా లేకపోవడంతో జంఝావతి ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.